బీరకాయ - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


బీరకాయను ఎలాంటి సమస్యతో ఉన్నావైరనా తినొచ్చు. బాలింతలకు, సర్జరీలు అయిన వాళ్లకు, శరీరం ధృఢంగా ఉండాలంటే బీరకాయనే ముందు పెడతారు. ఇందులో నీటి శాతం, ఫైబరే కాకుండా ఇంకా ఎన్నో పోషకాలు ఉన్నాయి. బీరకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, జింక్, కాపర్, థైమీన్, పిండి పదార్థాలు, నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. తరచూ బీరకాయ తినడం వల్ల రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు. బీరకాయలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిని తింటే ఐరన్ లోపం కారణం చేత వచ్చే రక్త హీనత తగ్గుతుంది. అలాగే బీరకాయలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తుంది. నొప్పులు, అలసట నుంచి కూడా దూరం చేస్తుంది. శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో బీరకాయ సహాయ పడుతుంది. దీంతో సీజనల్ వ్యాధులు, రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. ఎందుకంటే బీరకాయలో తగినంత ఫైబర్ ఉంటుంది. బీరకాయ చాలా త్వరగా అరిగిపోతుంది. దీని వల్ల కడుపులో నొప్పి, గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తవు. అదే విధంగా పేగుల కదలికను, జీర్ణ క్రియను కూడా మెరుగు పరుస్తుంది. చిన్న పిల్లలకు మలబద్ధకం సమస్య ఉంటే బీరకాయ పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలు, ఆల్కహాల్ అవశేషాలు, జీర్ణం కాని ఆహార కణాలను తొలగించడంలో బీరకాయ సహాయ పడుతుంది. అంతే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)