సెకండ్ వేవ్ తో 2 లక్ష కోట్ల నష్టం !

Telugu Lo Computer
0


సెకండ్‌ వేవ్‌ దెబ్బకు దేశ పరిస్థితి దిగజారిందని, దీని కారణంగా  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2 లక్షల కోట్లక మేరకు నష్టం వాటిల్లిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ( ఆర్బీఐ) తమ నెలవారీ బులెటిన్‌ (జూన్‌-2021)లో పేర్కొంది. చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా వైరస్‌ వ్యాపించడంతో ఈ పరిస్థితి నెలకొందని వారు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా సెకండ్‌వేవ్‌ నుంచి కోలుకొనేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఆర్బీఐ విడుదల చేసిన ఈ బులెటిన్‌లో ఆర్థిక వ్యవస్థ స్థితి, దిగుబడులు వంటి అంశాలను తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే కరోనా సెకండ్‌ వేవ్‌లో కాంటాక్ట్‌లెస్‌ సేవలు, పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది.

రానున్న రోజుల్లో కరోనా రికవరీలు పెరగడం, టీకా పంపిణీ వేగవంతం కావడం వల్ల ఆర్థిక వ్యవస్థ అవరోధాల నుంచి బయటపడేందుకు అవకాశాలున్నాయని ఆర్బీఐ తెలిపింది. భారత దేశ దిగుబడి 2019 రెండో త్రైమాసికం నుంచి దిగజారిందని ఆర్బీఐ వెల్లడించింది. భారత దేశం ఆర్థిక ఉద్దీపనల వల్ల సర్దుబాటు మార్గంలో పయనిస్తుందని ఆర్బీఐ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)