ఆన్ లైన్ రుణాల పేరిట మోసం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 11 November 2022

ఆన్ లైన్ రుణాల పేరిట మోసం !


తమిళనాడులో రుణాలిప్పిస్తామని నగదు వసూలు చేసే వ్యవహారంలో ఇద్దరు యువతులు సహా నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. చెన్నై, చేపాక్కం అరుణాచలం వీధికి చెందిన లక్ష్మికి కొన్ని రోజుల కిత్రం ఫోన్‌ చేసిన వ్యక్తి, ఎలాంటి పత్రాలు లేకుండా రూ.5 లక్షల రుణం ఇస్తామని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన ఆమె రుణం తీసుకునేందుకు అంగీకరించింది. రుణం కోసం ఇన్సూరెన్స్‌గా రూ.31,500 చెల్లించాలని ఆ వ్యక్తి కోరడంతో, లక్ష్మి గూగుల్‌ పే ద్వారా నగదు పంపించింది. అనంతరం ఆ వ్యక్తి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో అనుమానించిన లక్ష్మి ట్రిప్లికేన్‌ పోలీస్‏స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు, ఎన్నూర్‌ ప్రాంతానికి చెందిన వినిత, అయనావరంకు చెందిన థెరిస్సా, పల్లవన్‌తాంగళ్‌కు చెందిన పాల్‌జోసఫ్‌, కేకే నగర్‌కు చెందిన అరవింద్‌లను అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రైయివేటు కాల్‌ సెంటర్‌లో పనిచేస్తున్న వీరు పలువురికి ఫోన్‌ చేసి రుణాలు అందిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో, నలుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు. రుణాలు ఇప్పిస్తామంటూ వస్తున్న ఫోన్‌ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని, అనుమానించిన వెంటనే తమకు తెలియజేయాలని నగర పోలీసు శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

1 comment:

  1. For example, the supplier 카지노 사이트 shows a 6, the third baseman has 12 and hits a 10 to bust. The supplier turns up a 10 for sixteen, then attracts a 5 for 21, beating all gamers at the desk. The third baseman is more likely to|prone to} take heat from other gamers for taking the supplier's bust card as a substitute of standing.

    ReplyDelete