రెండో దశ పోలింగ్ లో త్రిపురలో అత్యధికంగా 77.93 శాతం ఓటింగ్ నమోదు !

Telugu Lo Computer
0


లోక్‌సభ ఎన్నికలు రెండో దశ నేడు  ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల సమయానికి త్రిపురలో అత్యధికంగా 77.93 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఉత్తరప్రదేశ్‌లో కనిష్టంగా 52.91 శాతం ఓటింగ్ నమోదైందని భారత ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వెల్లడైంది. మణిపూర్ (76.46 శాతం), పశ్చిమ బెంగాల్ (71.84 శాతం), ఛత్తీస్‌గఢ్ (72.13 శాతం), అస్సాం (70.67 శాతం) నియోజక వర్గాల్లో సాయంత్రం 6 గంటల సమయానికి పోలింగ్ ఆశాజనకంగానే సాగింది. తక్కువ పోలింగ్ అయిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (53.71 శాతం), బీహార్‌ (53.6 శాతం), మధ్యప్రదేశ్‌ (55.16 శాతం), రాజస్థాన్‌ (59.35 శాతం) ఉన్నాయి. మొదటి, రెండో దశలో సాపేక్షంగా తక్కువ పోలింగ్ నమోదైన రాష్ట్రాలు రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (53.71 శాతం), బీహార్‌ (53.6 శాతం), మధ్యప్రదేశ్‌ (55.16 శాతం), రాజస్థాన్‌ (59.35 శాతం) ఉన్నాయి. కేరళ (64.8 శాతం), కర్ణాటక (64.4 శాతం), జమ్మూ కాశ్మీర్ (67.22 శాతం) ప్రాంతాల్లో కూడా ఓటింగ్ ఓ మోస్తరుగా జరిగినట్లు తెలిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)