ఆటో డ్రైవర్ల నుంచి కమీషన్‌ తీసుకోకుండా ర్యాపిడో సేవలు !

Telugu Lo Computer
0


ఆటో డ్రైవర్ల నుంచి జీవిత కాలంపాటు ఎటువంటి కమీషన్‌ తీసుకోకుండా సేవలు అందిస్తామని ర్యాపిడో ప్రకటించింది. డ్రైవర్లు లాగిన్‌ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. నగరాన్నిబట్టి ఈ రుసుము రోజుకు రూ.9 నుంచి రూ.29 మధ్య ఉంటుంది. గత ఏడాది డిసెంబర్‌లో రాపిడో క్యాబ్‌లను ప్రారంభించి క్యాబ్ బుకింగ్ సేవల రంగంలోకి ప్రవేశించిన ర్యాపిడో క్యాబ్‌ డ్రైవర్‌లకు దాని జీరో-కమీషన్ మోడల్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఆ మోడల్‌ను ఆటో డ్రైవర్లకూ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం రోజూ 5 లక్షలకు పైగా ఆటో రైడ్‌లను సులభతరం చేస్తున్న ర్యాపిడో ఆఫ్‌లైన్ ఆటో డ్రైవర్లనూ తన ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాపిడో కోఫౌండర్ పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ సాస్ ప్లాట్‌ఫారమ్ ఆటోడ్రైవర్ల సంప్రదాయ కమీషన్ విధానాన్ని మారుస్తోందన్నారు. ర్యాపిడో​​ క్యాబ్ డ్రైవర్లు సాస్‌ మోడల్ ఆధారిత డిస్కవరీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ఇప్పుడు ఆటో డ్రైవర్‌లకు కూడా అందుబాటులో ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)