కరివేపాకుతో షుగర్ లెవల్స్ కంట్రోల్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 17 November 2023

కరివేపాకుతో షుగర్ లెవల్స్ కంట్రోల్ !


రివేపాకుతో రుచి మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా మేలు చేస్తుంది. కరివేపాకు తినాలని వైద్యులు కూడా చెబుతూంటారు. ముఖ్యంగా కరివే పాకును తినడం వల్ల కళ్లు, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపును మెరుగు పరచడంలో కరివే పాకు బాగా పని చేస్తుంది. అలాగే జుట్టు రాలే సమస్యల్ని కూడా తగ్గిస్తుంది. అయితే కరివేపాకుతో షుగర్ లెవల్స్ ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది. క్రమం తప్పకుండా కరివేపాకును తీసుకోవడం వల్ల డయాబెటీస్ తో పాటు జీర్ణశయం ఇతర అవయాల పని తీరు కూడా మెరుగు పడుతుందని తేలింది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాపర్, మెగ్నీషియం, క్యాల్షియం, ఫైబర్, ఫాస్పరస్, విటమిన్ సి, కార్బోహైడ్రేట్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. ఉదయం పరగడుపున కరివేపాకును తీసుకుంటే షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కరివేపాకును శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్లాసు వేడి నీటిలో కానీ,  లేదా పొడిని తిన్నా మంచి ఫలితాలు ఉంటాయి. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. పిండి పదార్థాలను గ్లూకోజ్ గా మార్చడాన్ని నివారించడంలో సహాయపడతాయి.  బరువు తగ్గాలనుకున్న వారు ప్రతి రోజూ ఉదయం పరగడుపున కరివేపాకు ఆకుల్ని నమిలి తినడం వల్ల శరీరం డిటాక్స్ అయ్యి.. మెటబాలిం పెరుగుతుంది. దీంతో క్రమంగా బరువు తగ్గుతుంటారు. కడుపు నొప్పి వచ్చినప్పుడల్లా కొద్దిగా నీటిలో కరివేపాకు వేసుకుని బాగా మరిగించు కోవాలి. ఇలా మరిగిన నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉనప్పుడు తాగితే.. కడుపులో నొప్పి మాత్రమే కాకుండా.. అనేక ఇతర సమస్యల నుంచి కూడా రిలీఫ్ వస్తుంది. చాలా మంది పింపుల్స్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ ఆకులని మెత్తగా రుబ్బి.. మొటిమలు లేదా చర్మంపై ఉన్న కురుపులపై రాయాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే రిజల్ట్ కనిపిస్తుంది.


No comments:

Post a Comment