చలి కాలం - ఖర్జూరం - ఉపయోగాలు !

Telugu Lo Computer
0


చలి కాలంలో ఖర్జూరాలను తింటే అనేక లాభాలు న్నాయి. వీటిలో విటమిన్లు, పొటాషియం, కాల్షియం, ఖనిజాలు, ఫైబర్, ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.  ఖర్జూర లో ముఖ్యంగా ఫైబర్స్, పాలీ ఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధులను దరిచేయనీయవు. అంతేకాకుండా పేగులో సమతుల్యతను పెంచి గట్ మైక్రోబయోమ్ కు సాయపడతాయని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఆధర్యంలో జరుగుతున్న పరిశోధనలో తేలింది. ఖర్జూరాలు గుండెకు ఆరోగ్యకరమైన ఆహారం. వీటిలో పోటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటి వినియోగం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తీసివేసేందుకు తోడ్పడుతుంది. గుండె జబ్బల ప్రమాదాన్ని తగ్గించడంలో ఖర్జూరాలు కీలక పాత్ర పోషిస్తాయి. చలి నుంచి కాపాడుకునేందుకు ఉత్తమమైన మార్గాల్లో ఒకటి ఖర్జూర తినడం. ఉడికించిన నీరు, 2-3 ఖర్జూరాలు, చిటికెడు ఎండుమిర్చి మిశ్రమం, యాలకుల పొడి కలిపి ఉడకబెట్టాలి.రాత్రి పడుకునే ముందు ఆ నీటిని తాగాలి. మరుసటి రోజు ఉదయం అద్భుతమైన ఫలితాలను చూస్తాం. ఖర్జూరలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్లు మన రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. మన రోజూ వారీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా అంటువ్యాధులు రావు. మొత్తం ఆరోగ్య, శక్తి పెరుగుతుంది. ఖర్జూరలో ఫాస్పరస్, పోటాషియం, కాల్షియం, మెగ్నీషీయం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరాలు విటమిన్ K మూలాన్ని అందిస్తాయి.బలమైన ఆరోగ్యకరమైన ఎముకల సంరక్షణ, అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)