ప్రభుత్వోద్యోగుల కోసం రూపే క్రెడిట్ కార్డ్ !

Telugu Lo Computer
0


ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఇండస్‌ఇండ్, రూపే నెట్‌వర్క్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో కలిసి సరికొత్త క్రెడిట్ కార్డు 'ఇండస్ఇండ్ బ్యాంక్ సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డు'ను ప్రభుత్వోద్యోగుల కోసం ఆవిష్కరించింది. ఎన్పీసీఐ సహకారంతో ఆవిష్కరించిన ఈ క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లింపులు చేసేయొచ్చు. ప్రభుత్వోద్యోగుల కోసం డిజైన్ చేసిన ఈ క్రెడిట్ కార్డుతో యూజర్లకు ఎక్స్ క్లూజివ్ బెనిఫిట్లు, ఓవరాల్ బ్యాంకింగ్ ఎక్స్ పీరియన్స్ పెంచుతాయని ఎన్పీసీఐ తెలిపింది. కాంప్లిమెంటరీ మూవీ టికెట్ల కొనుగోలు, ఐఆర్సీటీసీ ద్వారా లావాదేవీలు, ఫ్యుయల్ (పెట్రోల్, డీజిల్) బిల్లుల చెల్లింపులపైనా సర్ చార్జీ మాఫీ చేస్తారు. క్యాష్ అడ్వాన్స్ మీద అదనపు చార్జీలు ఉండవని ఇండస్ఇండ్ బ్యాంక్ పేర్కొంది. యూపీఐ అడ్వాన్స్‌డ్ ఫీచర్లతోపాటు సంప్రదాయ క్రెడిట్ కార్డు బెనిఫిట్లు కూడా పొందొచ్చు. యూపీఐ చెల్లింపులకు ఈ క్రెడిట్ కార్డు వాడొచ్చు. యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపుల అనుభవం పెంపొందించేందుకు ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు డిజైన్ చేసినట్లు ఎన్పీసీఐ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)