మధుమేహాన్ని అదుపు చేసే ఆహార పదార్ధాలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 27 August 2023

మధుమేహాన్ని అదుపు చేసే ఆహార పదార్ధాలు !


ట్ మీల్: ఓట్ మీల్ కూడా తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ని కలిగి ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి ఇది ఉత్తమమైన బ్రేక్ ఫాస్ట్. దీనిలోని అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్ల శోషణని నెమ్మదించేలా చేసి, రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది.

ఆపిల్స్: ఆపిల్స్‌లో కూడా తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కలిగి.. ఎక్కువ మొత్తంలో ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. ఈ కారణంగా ప్రతి రోజూ ఓ ఆపిల్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.

బచ్చలి కూర: బచ్చలి కూరలో కేలరీలు, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా బచ్చలికూరను ఆలివ్ నూనెలో వేయించి తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ఆధిపత్యం సాధించవచ్చు.

బాదం: బాదం పప్పులో ఇన్సులిన్ సెన్సిటీవిటీని మెరుగుపరిచే మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

చిక్కుళ్లు: చిక్కుడు జాతికి చెందిన అన్ని రకాల పప్పులను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇవి గ్లైసెమిక్ ఇండెక్స్‌లో తక్కువగా ఉన్నందున షుగర్ లెవెల్స్‌పై చెబు ప్రభావం పడదు. ఇంకా ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

క్యాబేజీ: క్యాబేజీ విషయానికి వస్తే ఇందులోని విటమిన్ కె ఇన్సులిన్ నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫలితంగా రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి.

No comments:

Post a Comment