ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు !

Telugu Lo Computer
0


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులుగా గెలిచిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్‌ దాఖలు చేయాలని వారిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారిపై అనర్హత పిటిషన్‌ను ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పీకర్‌ కార్యాలయానికి అందజేశారు. ఈ నోటీసుల వ్యవహారంతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం మొదలైంది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచి.. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేయాలంటూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకుడు కె.పి. వివేకానంద హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ క్రమంలో వారిద్దరికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌ 5వ తేదీకి వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)