మే 1 నుంచి రేషన్‌ కార్డుదారులకు కొత్త నిబంధనలు !

Telugu Lo Computer
0


తెలంగాణలో రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి కొత్త రేషన్‌ కార్డులను జారీ చేయలేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే రేషన్‌కార్డు పొందిన వాళ్లలో చాలా మంది అనర్హులు ఉన్నట్లుగా అధికారులుగుర్తించారు. అర్హులతో పోలిస్తే ఆర్థిక స్తోమత ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారే ఈ ప్రయోజనాన్ని ఎక్కువగా పొందుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆహార శాఖ ద్వారా అలాంటి వ్యక్తులను పథకం నుంచి అనర్హులుగా ప్రకటించేందుకు వారి జాబితాను రూపొందిస్తోంది. మే 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం అర్హత లేకున్నా రేషన్ తీసుకుంటున్న వారు, అక్రమంగా రేషన్ కార్డులను పొందిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. అంతే కాదు రేషన్ దుకాణాల్లో అక్రమంగా బియ్యం, గోధుమలను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణలో ఇప్పటికే రేషన్ కార్డులు లేని వారు చాలా మంది ఉన్నారు. వీరంతా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు వారి వివరాలను స్క్రుటినీ చేస్తున్నారు. దీని తర్వాత అంటే జూన్ రెండో వారంలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారి వివరాలను వెబ్ సైట్ లో పెట్టునున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)