వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తా: చంద్రబాబు నాయుడు

Telugu Lo Computer
0


తాము అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దెందులూరు సభలో ఆయన మాట్లాడుతూ.. 'పశువులు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీ ఇస్తాం. గోపాలమిత్రలను మళ్లీ నియమిస్తాం’ అని తెలిపారు. అలాగే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీలకు గ్రాట్యుటీ, ఆశావర్కర్లకు కనీస వేతనం పెంచుతామని అన్నారు. అలాగే వంగవీటి రాధాకు తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తనదని చంద్రబాబు హామీనిచ్చారు. ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ కోసం రాష్ట్రమంతా పర్యటిస్తున్నారన్నారు. ఆయన సేవలు ఈ రాష్ట్రానికి అవసరం అని అన్నారు. తన తండ్రి వంగవీటి రంగా ఆశయ సాధన కోసం రాధా కృషి చేస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. కాగా , రాధా విజయవాడ సెంట్రల్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఈసారి పోటీ చేస్తారని అంతా భావించినా అలా జరగలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)