ఖర్జూరం - ఆరోగ్య రహస్యాలు !

Telugu Lo Computer
0


ర్జూరాలు రోజు తింటే రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి పెరుగుతుంది. వీటిలో విటమిన్స్, మినరల్స్, క్యాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాలను చాక్లెట్లు, సిరప్, పాయసం తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇందులో తేమ ఎక్కువ తీపి తక్కువగా ఉంటుంది. ఖర్జూరం ఎండితే మరింత తీయగా ఉంటుంది. ఖర్జూరాల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల అవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. హైబీపీ ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండెజబ్బులు పక్షవాతం వంటివి కూడా తగుముఖం పడతాయి. అంతేకాదు మూతల పిండాలలో రాళ్లు కరగాలంటే ఖర్జూర పండు తరచుగా తినాలంటున్నారు. పోషకాహార నిపుణులు కంటి చూపు మెరుగవుతుంది. పెద్ద పేగులోని సమస్యలు తగ్గుతాయి. ఈ ఖర్జూరంలో ఐరన్ ఇతర విటమిన్స్ అధికంగా ఉండడం వల్ల ఇది జుట్టు రాలడం తగ్గించి పెరిగేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన బరువు పెంచేందుకు తోడ్పడుతుంది. కాబట్టి రోజు వారి ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చుకోవడం మంచిది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఎంతో ఇష్టంగా తినే ఈ ఖర్జూరాలను ప్రాసెసింగ్ ద్వారా చక్కెర జల్లి జ్యూస్ సిరప్ గా మార్చి విక్రయిస్తున్నారు. అలాంటివి తీసుకోకుండా వీటిని చెక్ చేసి తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. రక్తహీనత ఎక్కువగా ఉండటం వల్ల వారు ఖర్జూరాలను ఎక్కువగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు మరియు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం, పొటాషియం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కాపర్లు కూడా పుష్కలంగా ఉంటాయి. పిల్లలు వృద్దులు ఏదైనా జబ్బు నుంచి కోలుకునే వారికి ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది. ఇది ఆరోగ్య ప్రయోజన కార్యాన్ని కాకుండా చర్మ సౌందర్యానికి జుట్టు అందాన్ని మెరుగుపరచడానికి కూడా సహకరిస్తుంది.  అందుకే ముస్లిమ్స్ ఉపవాసం ఉన్న సమయంలో ఖర్జూరాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు

Post a Comment

0Comments

Post a Comment (0)