అంగన్వాడీలకు సమ్మె కాలానికి జీతాలు చెల్లిస్తూ ఉత్తర్వులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అంగన్వాడీలకు సమ్మె కాలాన్ని డ్యూటీలో ఉన్నట్లుగా పరిగణిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 42 రోజులపాటు సమ్మె కాలానికి జీతాలు చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, సమ్మె కాలాన్ని చెల్లించే జీతంలో కోత విధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుంచి ఈ సంవత్సరం జనవరి 22వ తేదీ వరకు అంగన్వాడీలు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 42 రోజులపాటు అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. వేతనాల పెంపుతో సహా పలు డిమాండ్లతో సమ్మెలోకి దిగారు. ఈ సమ్మె కాలాన్ని డ్యూటీలో ఉన్నట్లుగా పరిగణిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)