తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదన్న అమితాబ్ !

Telugu Lo Computer
0


తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలలో ఎటువంటి నిజం లేదని అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. బిగ్‌ బీ ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌  ఫైనల్స్‌ కు హాజరయ్యారు. అయితే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు అమితాబ్‌ ను మీ ఆరోగ్యం ఎలా ఉందని అడగడంతో నేను బాగానే ఉన్నానని, తన అనారోగ్యం పై వస్తోన్న వార్తలన్నీ కూడా ఫేక్ అని సమాధానం ఇచ్చారు. బిగ్ బి ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్స్‌ లో బాగా హుషారుగా పాల్గొని సందడి చేశారు. అక్కడ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ తో కలిసి మ్యాచ్‌ ను వీక్షించారు. అమితాబ్ బచ్చన్ ప్రస్తుత  బాలీవుడ్‌ లోనే కాకుండా దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తున్నారు. హీరో ప్రభాస్‌, డైరక్టర్ నాగ్‌ అశ్విన్‌ కాంబోలో తెరకెక్కుతోన్న 'కల్కి 2898 ఏడీ' సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు బిగ్ బి. 'కల్కి 2898 ఏడీ' మే9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీంతోపాటు రజనీకాంత్‌ నటిస్తోన్న టి.జి. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్న 'తలైవా 170' లో కూడా బిగ్ బి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)