దేశంలో కొత్తగా 774 కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగాఈ రోజులో 774 కేసులు నమోదు కావడంతో క్రియాశీల కేసుల సంఖ్య మొత్తం 4187కు చేరింది. గత 24 గంటల్లో తమిళనాడు, గుజరాత్‌ల్లో ఒక్కొకరు చనిపోయారు. దీంతో కొవిడ్ మృతుల సంఖ్య 5,33,387 కు పెరిగింది. ఈనెల 5 వరకు రెండంకెల్లోనే ఉండే కేసులు ఆ తరువాత నుంచి శీతల వాతావరణం, కొవిడ్ సబ్ వేరియంట్ జెఎన్.1 వ్యాపించడంతో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. డిసెంబర్ 5 తరువాత డిసెంబర్ 31న అత్యధికంగా 841 కేసులు నమోదై 2021 మే కంటే 0.21 శాతం ఎక్కువగా నమోదు కనిపించింది. 4187 క్రియాశీల కేసుల్లో 92 శాతం ఇంటివద్ద ఐసొలేషన్ వల్లనే కోలుకోవడమైంది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,44,79,804కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)