బోయింగ్ 737-8 విమానాలను చెక్ తనిఖీకి డీజీసీఏ ఆదేశం !

Telugu Lo Computer
0


లస్కా ఎయిర్ లైన్స్‌కి చెందిన బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానం దుర్ఘటన, ప్రపంచంతో పాటు దేశంలోని అన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలను షాక్‌కి గురిచేశాయి. బోయింగ్ 737-8 మ్యాక్స్ గాల్లో 16 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. డోర్ ఊడిపోయింది. టేకాఫ్ అయి కొన్ని నిమిషాలే కావడం, ఎయిర్ పోర్టు దగ్గరగానే ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో క్షేమంగా ల్యాండ్ అయింది. ఇదిలా ఉంటే ఈ ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దేశవ్యాప్తంగా పలు ఎయిర్ లైనర్లలో నడుస్తున్న బోయింగ్ 737-8 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను ఒకసారి తనిఖీ చేయాలని ఆదేశించింది. అయితే ఈ సంఘటనపై బోయింగ్ దర్యాప్తు చేయడానికి సిద్ధమైంది. అంతకుముందు కూడా బోయింగ్ 737 మాక్స్ విమానంలోని రడ్డర్ వ్యవస్థలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో దీనిపై కూడా విచారణ జరుగుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)