పవన్‌ను ఓడించలేకపోతే నా పేరు పద్మానాభరెడ్డిగా మార్చుకుంటా !

Telugu Lo Computer
0


వన్‌ కళ్యాణ్‌ ను పిఠాపురంలో ఓడిస్తాం, పవన్‌ను ఓడించలేకపోతే నా పేరు పద్మానాభరెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సవాల్‌ చేశారు. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ ను తన్ని తరిమేస్తారని హెచ్చరించారు ముద్రగడ పద్మనాభం. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం చంద్రబాబు తాత జాగీరు కాదని.. పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు. విషయము మీద అవగాహన లేక తెలుసుకోవడానికి ఖాళీ లేక పవన్ మాట్లాడుతున్నాడని ఫైర్‌ అయ్యారు. తుని రైలు దహనం జరిగినప్పుడు నీ పక్కన ఉన్న నెహ్రు వైసీపీ లొనే ఉన్నాడు తెలుసుకో అన్నారు. తుని రైలు సంఘటన కి చంద్రబాబు కారణం…పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని తెలిపారు. నన్ను తీహార్ జైలు కి పంపించాలని చంద్రబాబు ప్రయత్నం చేసాడని ఫైర్‌ అయ్యారు. చిరంజీవి కూటమికి మద్దతు ఇచ్చిన ఎటువంటి ప్రయోజనం ఉండదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు బయటకు వస్తే గౌరవిస్తారు….ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్,పోలవరం గురించి చిరంజీవి ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు. ఇప్పుడు మద్దతు గా వీడియో లు రిలీజ్ ఇస్తే ప్రజలు నమ్ముతారా ? అని ముద్రగడ కామెంట్స్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)