ఆరోగ్యం - వంటింటి చిట్కాలు !

Telugu Lo Computer
0


ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల వ్యాయామం చేస్తే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరం దాదాపు ఉండదు. దీనికి తోడు మరిన్ని ఆరోగ్య సూత్రాలను పాటిస్తే చాలు ఆరోగ్యకరంగా ఉంటారు. అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పని చేస్తుంది. ఉదర సంబంధ వ్యాధుల నివారణకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం గట్టిగా చెబుతోంది. వికారం, వాంతులు, విరోచనాలకు చెక్‌ పెడుతుంది. గర్భిణుల్లో వికారాన్ని, కీమోథెరపీతోపాటు ఎన్నో కారణాల వల్ల వచ్చే కడుపునొప్పిని అల్లం నివారిస్తోంది. ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్‌ చేసుకోవడం ఎంతో మంచిది. అలాగే వేడి నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం ఐదు లీటర్ల వరకు మంచి నీటిని తాగాలి. పెరట్లో లభించే తులసి ఆకులు నీటిలో కలిపి తాగడం శరీరానికి ఎంతో ఆరోగ్యం. యోగాతో కలిగే లాభాలేమిటో అందరికీ తెలిసిందే. యోగా వల్ల శరీరం కాంతివంతమవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. బద్ధకం తగ్గుతుంది. రక్తం శుభ్రపడుతుంది. శరీర అవయవాలకు రక్త సరఫరా బాగా జరగడంతో ఆక్సిజన్‌ బాగా అందుతుంది. నాడీ మండలం, మెదడు చైతన్యవంతమై చురుగ్గా పనిచేస్తుంది. మంచి ఆకలి, ధైర్యం పెరుగుతుంది. లవంగాలలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు దంతాలకు రక్షణ ఇస్తాయి. నోటిని, శ్వాసను తాజాగా ఉంచుతాయి. హృదయానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. యాంటిసెప్టిక్‌, యాంటీ బయోటిక్‌ ఔషధాల్లో లవంగాలను ఉపయోగిస్తారు. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెవిడ్‌ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్‌ ఇందులో మెండుగా ఉంటాయి. చక్కెరను నియంత్రించే దాల్చిన చెక్కలో ప్రోటీన్లు, పీచు, ఐరన్‌ సోడియం, విటమిన్‌ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలోని చెక్కరస్థాయిపై ప్రభావం చూపుతుంది. అలాగే కొలాస్ట్రాల్‌, ట్రైగ్లీసెరైడ్‌ స్థాయిని తగ్గిస్తుందని డాక్టర్లు సైతం చెబుతున్నారు. ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావల్సిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్లనొప్పులు, కండరాల నొప్పులను తగ్గిస్తాయి. శ్వాస అవరోధాలను దూరం చేస్తాయి. ఘాటుగా ఉండి నాలుకను చురుక్కమనిపించే మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడుతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి. బ్లాక్‌ కాఫీలో మిర్యాల పొడి వేసుకొని తాగితే రుతక్రమ సమయంలో ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇస్తుంది. జీలకర్రతో జీర్ణశక్తి పెరుగుతుంది. దీనిలోని క్యూ మిడ్‌ డీహైర్‌ అనే పరిమళం లాలాజల గ్రంధులను క్రియాశీలకంగా పనిచేసేటట్లు చేస్తాయి. ఆకలిని పుట్టిస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఊపిరితిత్తుల్లో కషాన్ని కరిగించి శ్లేష్మాన్ని తొలిగించే శక్తి యాలకులకు ఉంది. శ్యాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు యాలకులు వేసిన పాలను తాగించాలి. ఇది జీర్ణవ్యవస్థపై చక్కగా పని చేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని సంపూర్ణంగా తొలిగిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)