గిరిజన యూనివర్సిటీ బిల్లును ఆమోదించినందుకు రాష్ట్రపతికి సీతక్క కృతజ్ఞతలు !

Telugu Lo Computer
0

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కృతజ్ఞతలు తెలిపారు. శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు వచ్చి న రాష్ట్రపతిని మంగళవారం ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా లో ఏర్పాటు చేయనున్న సమ్మక్క-సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించిన బిల్లును ఆమోదించి చట్టబద్దత కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతేడాది డిసెంబర్‌లో రాష్ట్రపతి రామప్పకు వచ్చిన సందర్భంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలని కోరినట్లు చెప్పారు. యూనివర్సిటీ పనులు త్వరగా పూర్తి చేసి వచ్చే విద్యాసంవత్సరం తరగతులు ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని మంత్రి అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)