మెరుగైన నిద్ర కోసం నేల మీద పడుకోవడం ఉత్తమం !

Telugu Lo Computer
0


నేలపై చాప లేదా బెడ్ షీట్​ వేసి పడుకోండి. ఒక పక్కకు తిరిగి పడుకోవాలంటే.. ఎడమవైపు తిరిగి పడుకుంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణం కూడా తొందరగా అవుతుంది. నేలపై పడుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరుగుతుంది. కొంతమందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. దీనివల్ల నడుము, వీపు, భుజం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు. స్ట్రెస్ లేదా ఇతర కారణాల వల్ల వెన్నునొప్పి వస్తుందా? అయితే ఈ సమస్యకు చెక్​ పెట్టాలనుకుంటే మీరు నేలపై పడుకోవడం మంచిది.  నిద్ర భంగిమల్లో మార్పుల వల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశముంది. అయితే నేల మీద పడుకోవడం వల్ల నిద్ర భంగిమ కరెక్ట్​గా ఉంటుంది. అంతేకాకుండా హిప్ ఫ్లెక్సర్లు, హామ్ స్ట్రింగ్స్​కు ఉపశమనం లభించి నడుము నొప్పి తగ్గుతుంది. చాలా మంది నిటారుగా కాకుండా.. వంగి కూర్చోంటారు. ఇలాంటి పోస్టర్​ మీకు నడుము నొప్పిని కలిగిస్తుంది. అంతేకాకుండా మెడ వెనుక భాగంలో శరీరం ఎత్తుగా మారుతుంది. ఈ సమస్య ఉంటే నేలపై పడుకోవడం ఉత్తమం. ఇది మీ మెడ, తలను సరైన అమరికలోకి తీసుకువస్తుంది. వెన్ను నొప్పి సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. నిద్ర లేమి సమస్య వల్ల చేసే పనిపై శ్రద్ధ పెట్టలేము. ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అయితే నేల మీద పడుకోవడం వల్ల మీరు మెరుగైన నిద్ర పొందవచ్చు. మొదట్లో ఇది కాస్త అసౌకర్యాన్ని కలిగించినా తర్వాతి రోజుల్లో అలవాటు అవుతుంది. చలికాలంలో వేడిగా ఉంటే మంచిదే కానీ.. శరీరంలో వేడి ఎక్కువైతే.. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వాతవరణం వేడిగా ఉండడం వేరు.. శరీరంలో వేడి ఉండడం వేరు. ఈ సమస్యతో మీరు పరుపుపై పడుకుంటే.. దాని నుంచి వచ్చే వేడి కూడా మీకు ఇంకా చిరాకు, ఇబ్బందిని కలిగిస్తుంది. నేలపై పడుకోవడం వల్ల శరీరం ఉష్ణోగ్రతలు నార్మల్ అవుతాయని పలు అధ్యయనాలు నిరూపించాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)