బూడిద గుమ్మడి కాయ - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


బూడిద గుమ్మడి కాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల మనిషి శరీరాన్ని చల్లబరిచేందుకు ఉపయోగపడుతుంది.మార్కెట్లో దొరికే పండ్లతో పోలిస్తే ..అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ విటమిన్లను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బూడిద గుమ్మడికాయలో విటమిన్-C, కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్-B2, మెగ్నీషియం, విటమిన్ -C ,జింక్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పటు ఫైబర్ మరియు నీటి శాతాన్ని కూడా అధికంగా కలిగిఉంటుంది.మానవ శరీరానికి ఉపయోగపడే ఔషధ గుణాలను కలిగియుండటంతో పాటుగా పుష్కలంగా ఉన్నాయి. వీటిలోని విటమిన్ సి, నియాసిన్‌, థయామిన్‌, రైబోఫ్లేవిన్‌ లాంటి విటమిన్లు మరియు ఐరన్‌, పొటాషియం, జింక్‌, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా రోగనిరోధక శక్తీ, పెరగటమే కాక కంటి చూపు మెరుగుపడుతుంది.టైపు 2 డయాబెటిక్ ను నివారించటానికి బూడిద గుమ్మడికాయను నిత్యం ఆహారంలో చేర్చుకోవడం వల్ల టైపు 2 డయాబెటిక్ ను నియంత్రిస్తుంది. దీనిలో కాలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల గుమ్మడికాయను తీసుకుంటే కేవలం 13 క్యాలరీల మాత్రమే వస్తాయి. అంతేకాక కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా దీనిలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి.అందుకే బరువు తగ్గాలనుకునే వారికీ బూడిద గుమ్మడి ఒక వరం వంటిది. గుమ్మడి కాయను రోజు ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడటమే కాకుండా అల్జిమర్ర్ బారిన పడకుండా చేస్తుంది. బూడిద గుమ్మడిని సలాడ్లు, జ్యూస్‌లు, కూరలు, సూప్‌లు, స్మూతీలుగా అనేక రకాలుగా ఆహారంలోకి తీసుకోవచ్చు.బూడిద గుమ్మడి తో హల్వా, తీపి గుమ్మడి కూర, వడియాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పేట స్వీట్ ఇలా వివిధ రకాల ఆహారపదార్థాలుగా చేసి సేవిస్తుంటారు. గుమ్మడి కాయే కాకుండా గుమ్మడి గింజలలో కూడా పుష్కలమైన ఔషధ గుణాలు ఉండటంతో చర్మ రక్షణ సంబందిత క్రీములు, ఆయిల్స్ ను ఉపయోహిస్తారు.అందుకే బూడిద గుమ్మడిని గుమ్మాలకు కట్టానికే కాదు మనిషి ఆహారంగా తీసుకుంటే ఎన్నో ఉపయోగాలుంటాయి నిపుణులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)