మెంతులు - ఔషధ గుణాలు !

Telugu Lo Computer
0


మెంతుల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రుచికి కొంచెం చేదుగా ఉన్నప్పటికీ వీటిని ఆహారంలో కలిపి తీసుకుంటే ఎన్నో సమస్యలు పరారవుతాయి. ఎందుకంటే మెంతుల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి, నియాసిన్, పొటాషియం, ఐరన్, ఆల్కలాయిడ్స్ మెంతుల్లో ఉంటాయి. అలాగే అందం, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఫైబర్, విటమిన్లు, మెగ్నీషియంతో సహా వివిధ ఖనిజాలు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడటంతోపాటు రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంచుతుంది. అందుకే రోజూ ఒక గ్లాస్ మెంతి గింజలు నానబెట్టిన నీళ్ళు తాగడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. రెండు టీస్పూన్ల మెంతి గింజలను ఒక గ్లాసు నీళ్లోలో రాత్రంతా నానబెట్టి తర్వాత రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. మెంతి నీళ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల అజీర్ణం, విరేచనాలు, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది మెరుగైన పోషక శోషణను కూడా ప్రోత్సహిస్తుంది. మెంతి నీళ్లు ఆకలిని తగ్గించడం, జీవక్రియ రేటును పెంచడం, కొవ్వు పేరుకుపోవడాన్ని నివారించడం వంటి విధులు నిర్వహిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో మెంతి నీళ్లు తాగడం వల్ల ఎల్‌డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెంతి నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉచండానికి సహాయపడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత కలిగిన వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది. మెంతి నీళ్లలో ఉండే ఫైటోఈస్ట్రోజెన్ హార్మోన్ల అసమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. మెంతి నీళ్లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మొటిమలు తగ్గుతాయి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్లియర్ స్కిన్ టోన్, నేచురల్ గ్లో ఇస్తుంది. మెంతి నీళ్లు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. చుండ్రు, దురద వంటి స్కాల్ప్ సమస్యలను నివారిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మెంతి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, వివిధ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)