పొత్తికడుపు, తొడలు, చంకల దగ్గర చారలు - ఇంటి వైద్యం !

Telugu Lo Computer
0


కొంత మందికి పొత్తికడుపు, తొడలు, చంకల దగ్గర స్ట్రెచ్ మార్క్స్ (చారలు) వస్తాయి. బరువు తగ్గిన వారికి, ముఖ్యంగా ఆడవారు డెలివరీ అయ్యాక స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని తగ్గించేందుకు చాలా మంది క్రీమ్స్ వాడతారు. అలా కాకుండా కొన్ని నేచురల్ ప్రోడక్ట్స్‌ని వాడి సమస్యని తగ్గించుకోవచ్చు. కొబ్బరి నూనె పొడి చర్మం, చర్మంపై మచ్చలు, మొటిమలు, సాగిన గుర్తులని తగ్గిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది..ముందుగా కొబ్బరినూనె తీసుకుని స్ట్రెచ్ మార్క్స్‌పై రాసి మసాజ్ చేయండి. రోజు ఇలా చేయొచ్చు.. ఇలా రాత్రి క్రమం తప్పకుండ అప్లై చేస్తే కొద్ది రోజుల్లోనే మచ్చలు తగ్గిపోతాయి. అలోవెరా జెల్ అనేది మంచి మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు. ఇది చర్మాన్ని స్మూత్‌గా, మెరిసేలా, హైడ్రేటెడ్‌గా చేస్తుంది. ఇది చర్మంపై మచ్చలు, సాగిన గుర్తులని దూరం దూరం చేస్తుంది.. అలోవెరా జెల్‌ని రెగ్యులర్‌గా స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి మసాజ్ చేయాలి. దీని వల్ల సమస్య తగ్గుతుంది. ఆలు రసంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిని అప్లై చేయడం వల్ల చర్మంపై నలుపు తగ్గుతుంది. ఈ రసం రాస్తే మహిళల్లో చేతులు, పొత్తికడుపు, తొడలపై వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయి.. దీనిని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా స్ట్రెచ్ మార్క్స్, మచ్చలు త్వరగా తగ్గిపోతాయి. ఆలివ్ ఆయిల్ కూడా చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా రాస్తే చర్మంపై మచ్చలు, డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి. స్ట్రెచ్ మార్క్ కూడా తగ్గిపోతుంది..ఆలివ్ ఆయిల్‌ని కాస్తా వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి వదిలేయండి. అరగంట తర్వాత దీనిని నీటితో క్లీన్ చేయండి. సమస్య తగ్గిపోతుంది.. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అదనంగా, దాని జిగురు లాంటి పదార్థం చర్మానికి మెరుపుని అందిస్తుంది. ఈ గుడ్డులోని తెల్లసొన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మంపై ముడతలు, స్ట్రెచ్ మార్క్స్‌ని పోగొట్టడంలో సాయపడుతుంది. ముందుగా గుడ్డులోని తెల్ల సోనాను వేరు చేసి దానికి గ్లిజరిన్ వేయాలి. పావు చెంచా మాత్రమే. దీనిని స్ట్రెచ్ మార్క్స్ రాసి ఆరిపోయాక నీటితో క్లీన్ చేయండి, మార్క్స్ త్వరగా పోతాయి..


Post a Comment

0Comments

Post a Comment (0)