ఇది నాకు మూడో పునర్జన్మ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 3 September 2023

ఇది నాకు మూడో పునర్జన్మ !


ర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి ఇటీవల స్ట్రోక్‌కి గురై కోలుకున్నారు.  తనకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడికి, చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సేవ చేసేందుకు తాను కొత్త జీవితాన్ని పొందానని ఆయన అన్నారు. డిశ్చార్జ్ అయ్యే ముందు స్ట్రోక్, దాని లక్షణాలను తేలికగా తీసుకోద్దని ప్రజలు, కుమారస్వామికి సూచించారు. 'గత ఐదు రోజులుగా నా స్నేహితులు కొందరు భయంతో ఉన్నారు. మీతో మాట్లాడుతుంటే నాకు పునర్జన్మ వచ్చింది'' అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. నా ఆరోగ్యానికి సంబంధించి దేవుడు నాకు మూడో జన్మ ఇచ్చాడని, ఒక వ్యక్తికి ఒక జన్మ ఉంటే, నా విషయంలో 64 ఏళ్ల వయసులో నాకు మూడో జన్మ వచ్చిందని కుమారస్వామి ఎమోషనల్ అయ్యారు. ఆగస్టు 30న తెల్లవారుజామున కుమారస్వామికి స్వల్ప పక్షవాతానికి గురయ్యారు. దీంతో ఆయనను బెంగళూర్ లోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ రోజు ఆరోగ్యం బాగా లేదని గుర్తించానని, వెంటనే ఆస్పత్రికి వెళ్లానని తెలిపారు. పక్షవాతం లక్షణాలు కనిపిస్తే ఒక్క నిమిషం కూడా వృధా చేయవద్దని కుమారస్వామి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పక్షవాతానికి గురైన రోగుల్ని గోల్డెన్ అవర్స్ లో ఆస్పత్రికి తీసుకురావాని ప్రముఖ న్యూరాలజిస్ట్‌ సతీష్ చంద్ర అన్నారు. పెదవులు తడబడుతుంటే, కళ్ళు కష్టంగా ఉంటే, ముఖంలో మార్పులు ఉంటే, సమయం వృథా చేయకుండా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. 

No comments:

Post a Comment