గసగసాలు - ప్రయోజనాలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 1 May 2022

గసగసాలు - ప్రయోజనాలు !


వంద గ్రాముల గసగసాలలో 525 కేలరీలు ఉంటాయి. వీటిలో కాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. గసగసాలను కేవలం వంట గదిలో మసాలా దినుసుగానే చాలా మంది భావిస్తారు. అయితే ఆరోగ్యానికి మేలు చేసే అనేక ప్రయోజనాలను ఇవి అందిస్తాయి. నిద్ర లేమితో బాధపడుతున్న వారికి నిద్ర సమస్యలను పోగొట్టటంలో ఉపకరిస్తాయి. మనస్సు ప్రశాంతను కలిగించటంతోపాటు ఒత్తిడిని తగ్గించి నిద్రను మెరుగుపరిచేలా చేస్తాయి. గసగసాలలో పీచు పదార్ధం అధికంగా ఉంటుంది. ఇది పేగుల్లో కలికలను పెంపొందించటంలో సహాయపడతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఆడవాళ్లల్లో వంధ్యత్వాన్ని తొలగించి సంతనోత్సత్తి శక్తిని పెంపొందిస్తాయి. పాలియోపియన్ గొట్టాల్లో ఉండే వ్యర్ధాల్ని , అడ్డంకులను తొలగించి శుభ్రం చేయటంతోపాటు, లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గసగసాల గింజల్లో ఉండే జింక్ కంటి చూపును పెంపొందిస్తాయి. దృష్టి చూపు క్షీణతను తగ్గిస్తుంది. వీటిల్లో ఉండే అనామ్లజనకాలు కంటి కణాలపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా వయసు సంబంధిత చూపు ప్రమాదాలను తగ్గించటంలో సహాయపడతాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంది. వీటిలో ఉండే ఆక్సలేట్లు, కాల్షియంను గ్రహించి, రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి. కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గిస్తాయి. వీటిల్లో ఉండే మంచి సమతుల్య కొలెస్ట్రాల్ స్ధాయి గుండె సంబంధిత వ్యాధులు తగ్గించటంతోపాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఆమ్లాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. రోగనిరోధక వ్యవస్ధను బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషిస్తాయి. నోటి పూత సమస్యలను నివారించే శక్తి వీటికి ఉంది.

No comments:

Post a Comment