కటకటాల వెనక్కి బండారులంక స్కూల్ హెడ్‌ మాస్టర్..! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 1 May 2022

కటకటాల వెనక్కి బండారులంక స్కూల్ హెడ్‌ మాస్టర్..!


ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం గ్రామీణ మండలం బండారులంక హైస్కూల్లో ఎన్వీఎస్ఎస్ దుర్గాప్రసాద్ హెడ్‌ మాస్టార్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా కొందరు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. ఎక్కడబడితే అక్కడ చేతులు వేయడం, పిల్లల పట్ల అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం, వారిపట్ల అనుచితంగా ప్రవర్తించడం వంటి చేష్టలతో విద్యార్థినులు విసుగెత్తిపోయారని వారి తల్లితండ్రులు అధికారులకు తెలిపారు. దీనిపై అమలాపురం డీఎస్పీ వై.మాధవ రెడ్డి విచారణ చేసి నిందితుడు దుర్గాప్రసాద్ పై ఫోక్సో యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. దుర్గాప్రసాద్ పై విచారణ చేసిన పోలీసు, ఐసీడీఎస్ అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. కావాలనే విద్యార్థులతో ఎక్కువ సమయం గడపడం, వారిని దగ్గరగా పిలిపించుకుని వారిపై తాకకూడని చోట్ల చేతులు వేయడం, తుంటరి మాటలతో అసభ్యంగా మాట్లాడడం వంటి వికృత చేష్టలు చేస్తున్నాడని విద్యార్థులు అధికారుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు దుర్గా ప్రసాద్ పై ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో దొరికిపోయిన దుర్గాప్రసాద్ ను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. విద్యార్థులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంతో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులతోపాటు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా విచారణ చేసి బాధిత విద్యార్థులు, తల్లితండ్రుల నుంచి వివరాలు సేకరించారు. 

No comments:

Post a Comment