నిమ్మరసం - కలిగే ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


ప్రతి రోజూ నిమ్మరసాన్ని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఇందులో వైటమిన్ సి మాత్రమే కాదు, శరీరంలోంచి విషపదార్ధాలను తొలగించే డిటాక్స్ ప్రక్రియను చేపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచే పోషకాలు నిమ్మరసంలో ఉన్నాయి. మలబద్దకం, యాసిడిటీ లాంటివి తగ్గించే శక్తి నిమ్మరసానికి ఉంది. కేవలం ఎండా కాలంలోనే కాకుండా చలికాాలంలోనైనా సరే ఓ కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని పిండుకొని తాగండి. జీర్ణక్రియ వ్యవస్థలో ఏవైనా విషపదార్ధాలు ఉంటే తొలగిస్తుంది. శరీరం మొత్తన్నా డీటాక్స్ చేస్తుంది. నిమ్మలో ఉండే వైటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎటువంటి ఇన్‌ఫెక్షన్లకు కూడా గురికాకుండా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. చర్మంపై ఎటువంటి మచ్చలు, ముడతలు ఉన్నా రోజూ నిమ్మరసం తాగితే తొలగిపోతాయ్. చర్మంలో ఉంటే హానికరమైన బ్యాక్టీరియాను కూడా తొలగించడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. భోజనం చేసిన వెంటనే ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. నోటికి సంబంధించిన బ్యాక్టీరియా, పంటినొప్పుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. బరువును తగ్గించడంలో కూడా నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. ఒక నిమ్మలో ఉండే పోషకాల వల్ల ఎక్కువ కేలరీలు శరీరానికి అవసరం పడకుండా అవసరమైనంత శక్తినిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కూడా జీర్ణక్రియకు దోహదపడుతుంది. ప్రతీ రోజూ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. సిట్రిక్ యాసిడ్ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సాయపడుతుంది. ఏదైనా చిన్నగాయం అయితే రక్తం బయటకి వచ్చి తరువాత ఆ గాయం పై రక్తం గడ్డకట్టి మూసుకుపోతుంది. రక్తాన్ని గడ్డకట్టించేదే కొల్లాజెన్. కాబట్టి నిమ్మరసాన్ని ప్రతీ రోజు ఓ చిన్నకప్పు నీటిలోనైనా కలిపి తీసుకోవాలి. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ శరీరంలో సిట్రేట్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లను కరిగించే సామర్ధ్యం ఉంటుంది. అందువల్ల నిమ్మరసం కిడ్నీలకు కూడా చాలా మంచిది. నిమ్మకాయరసంతో కేవలం ఆరోగ్యప్రయోజనాలు మాత్రమే కాదు అందం కూడా పెరుగుతుంది. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)