లవంగాలు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


వంగాలలో విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి . లవంగాల నానబెట్టి ఆ నీటిని తీసుకోవచ్చు లేదా రెండు లవంగాలను బుగ్గన పెట్టుకుని నమిలి రసాన్ని మింగవచ్చు. లవంగాలను వేయించి పొడి చేసుకొని నిలువ చేసుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పొడి కలిపి తాగాలి లేదా రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను నమలాలి. లేదంటే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో రెండు లవంగాలు నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి. లవంగాలను ఎలా తీసుకున్నా సరే వాటిలో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. ముఖ్యంగా చలికాలంలో లవంగం తీసుకోవటం వలన జీర్ణక్రియను మెరుగు పరచుటమే కాకుండా అధిక బరువు సమస్య తగ్గటానికి సహాయపడుతుంది. జీవక్రియను వేగవంతం చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దంత సమస్యలను తగ్గిస్తుంది. దంత సమస్యలు ఉన్నప్పుడూ పంటి కింద లవంగం మొగ్గను పెట్టుకుంటే సరిపోతుంది. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)