క్రికెటర్ సర్ఫరాజ్ తండ్రికి ఆనంద్ మహీంద్ర థార్ కార్ గిఫ్ట్ !

Telugu Lo Computer
0


ప్రపంచంలో ఏ మూలన టాలెంట్ ఉన్నా ఆనంద్ మహీంద్ర ప్రశంసిస్తూ వారికి తగిన సాయం చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో తనను ఫిదా చేసిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటాడు. మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. టీమిండియా లేటెస్ట్ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రిని ఉద్దేశించి భావోద్వేగపూరితమైన ట్వీట్ చేయడంతో పాటుగా ప్రశంసల్లో ముంచెత్తాడు. ఆ ట్వీట్ లో..'కృషి, పట్టుదల, సాధించాలనే తపన, కఠోర శ్రమ ఉంటే ఏదైనా సాధించగలం. ఇక ఇంతకంటే గొప్ప లక్షణాలు ఏముంటాయి ఒక తండ్రి పిల్లల్లో స్ఫూర్తి నింపడానికి. అందుకే ఇలాంటి గొప్ప తండ్రికి నేను థార్ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నాకూ గౌరవమే. అయితే చిరు కానుకను ఆయన స్వీకరిస్తారని ఆశీస్తున్నాను' అంటూ ఆ ట్వీట్ లో రాసుకొచ్చాడు ఆనంద్ మహీంద్ర. ఇక తొలి టెస్ట్ లోనే 62 పరుగులు చేసి అదరగొట్టాడు సర్ఫరాజ్ ఖాన్. 97 జెర్సీ నంబర్ ధరించడం వెనక ఉన్న రీజన్ ను చెప్పాడు. తన తండ్రి నౌషద్ ఖాన్ పేరులోని నౌ నుంచి 9, షాద్ నుంచి 7 నంబర్లను తీసుకున్నట్లుగా మూడో టెస్ట్ కు ముందు చెప్పుకొచ్చాడు. ఇక సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ సైతం జెర్సీ నంబర్ 97 కావడం విశేషం. 

Post a Comment

0Comments

Post a Comment (0)