జనతాదళ్ (యు) అధ్యక్షుడిగా నితీశ్ కుమార్ ఎన్నిక !

Telugu Lo Computer
0


నతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడిగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. జనతాదళ్ (యు) అధ్యక్షుడిగా ఇప్పటి వరకు వ్యవహరించిన లలన్ సింగ్ వైదొలగడంతో శుక్రవారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన స్థానంలో నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం, కుల గణన కోసం పోరాటాన్ని సాగించడంలో ఆయన నితీశ్ కుమార్ పాత్రను పార్టీ జాతీయ కార్యవర్గం ప్రశంసించింది. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి నితీశ్ అంగీకరించినట్లు జనతాదళ్ (యు) అధికార ప్రతినిధి కేసీ త్యాగి తెలిపారు. ఆంతరంగికంగా జరిగిన కార్యవర్గ సమావేశంలో పార్టీ అధ్యక్ష పదవి నుంచి లలన్ సింగ్ వైదొలగి నితీశ్ కుమార్ పేరును ప్రతిపాదించారు. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నితీశ్ సేవలు పార్టీకి ఎంతైనా అవసరమని కార్యవర్గం అభిప్రాయపడింది. ప్రస్తుతం ముంగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నితీశ్ అసెంబ్లీకి పోటీ చేస్తారా లేక లోక్‌సభకు పోటీచేస్తారా అన్న విషయం స్పష్టంకాలేదు. జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న నితీశ్ కుమార్ ఈ సంక్లిష్ట దశలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పార్టీలోని పలువురు నేతలు కోరినట్లు వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష ఇండియా కూటమిలో జెడి(యు) భాగస్వామ్య పక్షంగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)