బంతిని కొట్టబోయి బొక్కబోర్లా పడ్డ ఎమ్మెల్యే !

Telugu Lo Computer
0


డిశాలోని కలహండి జిల్లా నార్ల నియోజకవర్గం ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ ఇటీవల కలహండిలో క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రారంభించారు. యువకుల హుషారు, క్రికెట్‌ పిచ్‌ చూడగానే బ్యాట్‌ పట్టుకోకుండా ఉండలేకపోయారు. ఒక యువకుడు బాల్‌ వేయగా బ్యాట్‌తో బిగ్‌ షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ అదుపు తప్పి నేలపై బొక్క బోర్లా పడ్డారు. దీంతో తల, ముఖం, చేతులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. రాజకీయ నాయకులు రాజకీయాలకు పరిమితమైతే మంచిదని కొందరు సూచించారు. క్రీడల్లో కూడా రాజకీయం చేయాలని చూస్తే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని మరికొందరు వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)