ఇండియా కూటమిని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 23 October 2023

ఇండియా కూటమిని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు !


బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమిని ప్రజలు చూస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. నేడు దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు. వీటి పరిష్కారం పట్ల బీజేపీ ప్రభుత్వాన్నికి శ్రద్ధ లేదన్నారు. ఇదిలా ఉంటే ప్రజలు ఇండియా కూటమిని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు కేజ్రీవాల్ అన్నారు. ఇంతకుముందు ఆప్షన్ లేదని చెప్పేవారు, కానీ ఇప్పుడు అందరూ ఇండియా అలయన్స్‌ను ఆప్షన్‌గా చూస్తున్నారన్నారు. ఇండియా అలయన్స్ ఏర్పడినప్పటి నుండి తనకు చాలా సందేశాలు వచ్చాయని తెలిపారు. ఇండియా అలయన్స్ మనుగడ సాగిస్తే 2024లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడదని కేజ్రీవాల్ అన్నారు. కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ  ప్రతి ఇంటికి వెళ్లి మాట్లాడటం ప్రజలతో మాట్లాడండి అని అన్నారు. అభివృద్ధి, మీ కుటుంబ శ్రేయస్సు కావాలంటే ఈసారి బిజెపిని తరిమికొట్టాలని సూచించారు. ఇదిలా ఉంటే బీజేపీ కార్యకర్తలతో జోక్యం చేసుకోవద్దని అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు సూచించారు. వారితో మమేకం కావద్దని, దేశభక్తులతో మాట్లాడండి అని అన్నారు. 

No comments:

Post a Comment