గర్బా డ్యాన్స్ చేస్తూ 24 గంటల్లో పది మంది గుండెపోటుతో మృతి

Telugu Lo Computer
0


గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గర్బా డ్యాన్స్ చేస్తూ పలువురికి గుండెపోటు రావడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 10 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. బాధితులు యువకులు, మధ్య వయస్కులే కావడం ఆందోళనకరం. బరోడాలోని దభోయ్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు కూడా మృతుల్లో ఉండటం అందరినీ షాక్‌కు గురి చేసింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు గర్బా ఆడుతూ కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. కపద్వాంజ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు కూడా అదే విధంగా మరణించాడు. నవరాత్రుల మొదటి 6 రోజుల్లో, 108 అంబులెన్స్ సేవలకు గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి మొత్తం 521 కాల్‌లు వచ్చాయి. గర్బా వేడుకల సమయమైన సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య శ్వాస ఆడకపోవడానికి సంబంధించి 609 కాల్స్ వచ్చినట్లు అధికారులు వివరించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున ప్రభుత్వంతో పాటు కార్యక్రమ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)