వాము - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


గ్యాస్ సమస్య తగ్గించుకోవటానికి మందులు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలతో కూడా సమర్ధవంతంగా తగ్గించుకోవచ్చు. గ్యాస్ సమస్య ప్రారంభదశలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో వాము ఎక్కువగా వాడతారు. వాములో ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఆరస్పూన్ వాములో చిటికెడు రాక్ సాల్ట్ వేసి బాగా దంచి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నోట్లో వేసుకుని నములుతూ వచ్చే రసాన్ని మింగాలి. ఇది కొంచెం వగరుగా, చేదుగా ఉంటుంది. ఈ రసం మింగటం వలన గ్యాస్, కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. వాము మిశ్రమం వేసుకున్నాక ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల గ్యాస్ బయటికి పోయి కడుపునొప్పి తగ్గుతుంది. వాము అనేది పురాతన కాలం నుండి అజీర్ణ సమస్యలకు వాడుతున్నారు. రాక్స్ సాల్ట్ అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రేగు కదలికలు ప్రోత్సహిస్తుంది. ప్రేగుల నుండి విషపదార్థాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఆకలిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)