పచ్చ కర్పూరం - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


ప్రసాదాలు, మిఠాయిల్లో కాస్త పచ్చకర్పూరం వేస్తే వచ్చే సువాసనే వేరు. దీన్ని అందం పరిరక్షణలోనూ కూడా వాడతారు. చెంచా నిమ్మరసంలో కాస్త పచ్చ కర్పూరం కలిపి ముఖంపై మచ్చలు, మొటిమలుఉన్నచోట రాయండి. ఆరాక చల్లటి నీటితో కడిగితే ఫలితం కనిపిస్తుంది. కొబ్బరినూనెలో ఈ పొడిని కలిపి, మాడుకు మృదువుగా మర్దనా చేయాలి. గంట తర్వాత గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. రక్తప్రసరణ బాగా జరిగి, జుట్టు రాలే సమస్యా దూరమవుతుంది. చిటికెడు పచ్చకర్పూరం పొడి కలిపిన నీటితో తరచూ స్నానం చేస్తే చర్మ సమస్యలు దూరమవుతాయి.గోళ్లకు ఇన్‌ఫెక్షన్‌ సోకినా పచ్చకర్పూరంతో చెక్‌ పెట్టొచ్చు. కొబ్బరినూనెను గోరువెచ్చగా వేడి చేసి దానికి కాస్త పచ్చ కర్పూరం పొడి కలపాలి. ఆ నూనెలో గోళ్లను మునిగేలా ఉంచి, తర్వాత కడిగేస్తే సరి. ఇలా తరచూ చేస్తే ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.చర్మంపై అలర్జీలు వచ్చినా, వాటి వల్ల కలిగే దురద నుంచి ఉపశమనం కావాలన్నా కొబ్బరి నూనెలో పచ్చ కర్పూరం కలిపి రాయొచ్చు. త్వరిత ఉపశమనం కలుగుతుంది. మచ్చల్లాంటివీ ఉండవు.

Post a Comment

0Comments

Post a Comment (0)