పొన్నగంటికూర - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0

పొన్నగంటి ఆకులో ఆరోగ్యానికి మేలు చేసే ఎ, బి6, సి విటమిన్లు, ఫొలేట్‌, రైబోఫ్లెవిన్‌, పొటాషియం, ఐరన్‌, మెగ్నీషియం సమృద్ధిగా దొరకుతాయి. దీన్ని తరచూ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. పొన్నగంటి ఆకు గుండె, మెదడుకు ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే ఫలితముంటుంది. దీనిలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్‌ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది.  అలాగే క్యాన్సర్ కారకాలను నయం చేస్తుంది. బరువును కంట్రోల్ చేస్తుంది. కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను తీసుకుంటే సన్నగా ఉన్నవారు బరువు పెరుగుతారు. అలాగే ఈ ఆకును ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. కంటి కలకలు, కురుపులతో బాధపడేవాళ్లు తాజా ఆకుల్ని కళ్లమీద కాసేపు పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. నరాల్లో నొప్పికి ముఖ్యంగా, వెన్నునొప్పికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకు కూరను తింటే పురుషులకు కావలసిన శక్తిని సమకూరుస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.. పొన్నగంటి కూర జీవక్రియల్లోని లోపాలను సరిచేస్తుంది. టేబుల్‌ స్పూను తాజా ఆకుల రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా తగ్గుతాయి. నరాల్లో నొప్పికి, వెన్నునొప్పికి పొన్నగంటి కూర దివ్యౌషధంగా పనిచేస్తుంది.. ఇంకా ఎన్నో సమస్యలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)