కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

Telugu Lo Computer
0


నైరుతి పవనాలు గురువారం కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం కొన్ని ప్రాంతాలు, మొత్తం లక్షద్వీప్ ప్రాంతం, కేరళలోని చాలా ప్రాంతాలు, దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, కొమోరిన్ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలు, గల్ఫ్ ఆఫ్ మన్నార్, మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. రాగల 48 గంటల్లో కేరళ అంతటా , తమిళనాడు, కర్ణాటక లోని కొన్ని భాగాలకు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి.దీంతో వేసవి తాపం నుంచి ప్రజలకు ఒకింత ఊరట లభించినట్లయింది.ఏడు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. గత 24 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘాలు పెరిగాయి. గడచిన 24 గంటల్లో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలోకి రుతుపవనాలు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పటికీ, భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.రుతుపవనాలు భారతదేశ వ్యవసాయానికి కీలకం. 52 శాతం నికర సాగు విస్తీర్ణం వర్షాలపై ఆధారపడి ఉంది. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తితోపాటు తాగునీటికి కీలకమైన రిజర్వాయర్లను నింపడానికి కూడా వర్షాలే కీలకం. ఉత్తర చత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్న ద్రోణి గురువారం బలహీన పడింది.దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య, పశ్చిమ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయని వాతావరణశాఖ హైదరాబాద్ సంచాలకులు చెప్పారు.నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళలో ప్రవేశించాయి. రాగల 48 గంటల్లో కేరళ అంతటా , తమిళనాడు, కర్ణాటక లోని కొన్ని భాగాలకు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు, రేపు అక్కడక్కడ, ఎల్లుండి కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)