ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ప్రిన్సిపాల్ లీలలు !

Telugu Lo Computer
0


విజయవాడ నవోదయ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రరెడ్డి పై మరో కేసు నమోదైంది. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ తనపై పలుమార్లు అత్యాచారం చేశారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో తాను కళాశాలలో చదువుకునే సమయంలో ప్రిన్సిపల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఎవరికైనా ఈ విషయం చెబితే చదువు మధ్యలో ఆగిపోతుందని.. తన సర్టిఫికెట్స్ ఇవ్వరనే భయంతో గతంలో ఫిర్యాదు చేయలేదని యువతి పేర్కొంది. తనకు వివాహమైన తర్వాత కూడా వేధిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. తమను ప్రిన్సిపల్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ రెండు రోజుల కిందట కొత్తపేట పీఎస్ లో కళాశాల విద్యార్ధినులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టేందుకు ముందుకు వచ్చినట్లు బాధితురాలు తెలిపింది. మొదట కేసు నమోదు చేసిన కేసులో పోలీసులు రవీంద్రను అరెస్ట్ చేశారు. కోర్టు 41 ఏ సిఆర్పీసీ ప్రకారం నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం అతనికి నోటీసులు ఇచ్చారు. తాజాగా మరో ఫిర్యాదు రావటంతో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం కొత్తపేట పీఎస్​లో నర్సింగ్ కళాశాల విద్యార్ధినులు తమ ప్రిన్సిపల్ వేధింపులపై ఫిర్యాదు చేయగా... మరో పూర్వ విద్యార్థిని సైతం తనపై ప్రిన్సిపల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  విజయవాడలోని అంబాపురంలో ఉన్న నర్సింగ్ కళాశాలలో అల్లూరి జిల్లాకు చెందిన ఓ యువతి (23) 2017 నుంచి 2020 వరకు నర్సింగ్ కోర్సు అభ్యసించింది. 2019లో 3వ సంవత్సరం చదువుతున్న సమయంలో తోటి విద్యార్థుల హాజరుపట్టి ఇచ్చేందుకు ప్రిన్సిపల్ కార్యాలయంలోకి వెళ్లగా దాన్ని తీసుకుంటూ చేతులు పట్టుకొని ఎక్కడపడితే అక్కడ తాకడం చేశాడు. 2019 జులై మొదటి వారంలో తరగతిలో ఉండగా తల్లి దండ్రుల నుంచి ఫోన్ వచ్చిందని ప్రిన్సిపల్ తన గదికి పిలిపించాడు. ఫోన్ ఇస్తూ యువతి చెయ్యి పట్టుకుని తలుపు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చదువు మధ్యలోనే ఆగిపోతుందని, ధ్రువీకరణప త్రాలు కూడా ఇవ్వనని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో జరిగిన విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పలేదనీ అలా మరో రెండుమార్లు ఫోన్ పేరుతో గదికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు మాత్రలు వాడారు. తరువాత ఆమె ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నారు. విద్యార్థినులను ప్రిన్సిపల్ ఇబ్బంది పెడుతున్నాడని పత్రికల్లో వార్తలను ఆమె చూసింది. తనకు జరిగిన విషయంతో పాటు తాను కోయ సామాజికవర్గా నికి చెందిన వ్యక్తినని, తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ప్రిన్సిపల్ రవీంద్రరెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ కొత్తపేట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)