సబ్జా గింజలు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చలువ చేసే పదార్ధాలను చాలామంది తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిల్లో సబ్జా గింజలు కూడా ఒకటి. వేసవి కాలంలో సబ్జాలు తీసుకోవడం వల్ల శరీరంలోని ఉష్ణం తగ్గుతుంది.  సబ్జా గింజలు వాటి బరువు కన్నా ఏడెనిమిది రెట్లు ఎక్కువగా నీటిని పీల్చుకుంటాయి. వీటిని ఎండాకాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి నీటి శాతం ఎక్కువ లభిస్తుంది. దాంతో పాటు గొంతు తడి ఆరిపోకుండా ఉంటుంది. సబ్జాలలో ఎన్నో ఖనిజ లవణాలు ఉన్నాయి. క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, పాస్పరస్, మల్టీవిటమిన్లు లాంటి ఎన్నో పోషకాలు వీటిల్లో పుష్కలంగా లభిస్తాయి. వీటివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు సబ్జాలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. టైప్-2 డయాబెటిస్, కొలెస్ట్రాల్, ఒత్తిడి వంటి సమస్యలకు సబ్జాలతో చెక్ పెట్టేయవచ్చు. సబ్జాలలో ఫైబర్ అధికశాతం ఉండటం వల్ల వీటిని తీసుకుంటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీని వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. అలాగే సబ్జా గింజలను రోజూ తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. అలాగే సబ్జా గింజలలో పీచు పదార్ధం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు పదార్ధం వల్ల మలబద్దకం సమస్య కూడా దూరమవుతుంది. జీర్ణకోశంలో ఉండే సూక్ష్మజీవులను కూడా నాశనం చేసి జీర్ణక్రియను మెరుగుపర్చడంలో ఇవి ఉపయోగపడతాయి. సబ్జా గింజలలో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను వెంటనే తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. సబ్జాలను తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. వీటితో పాటు చర్మ, జుట్టు సౌందర్యాన్ని పెంచడంలో కూడా సబ్జా గింజలు చాలా ఉపయోగపడతాయట. సబ్జా గింజల ద్వారా ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి సోరియాసిస్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి. సబ్జా గింజలను నీళ్లల్లో నానబెట్టడం వల్ల మెత్తగా అవుతాయి. దీంతో వీటిని తీసుకోవడం వల్ల వెంటనే జీర్ణం అవుతాయి. అంతేకాకుండా యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు సబ్జా గింజల్లో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోకి ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా అడ్డుకోవడంతో పాటు శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తోంది. అలాగే సబ్జా గింజల్లో ఉండే ఆయుర్వేద గుణాల వల్ల క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా కాపాడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)