రతన్‌లాల్ కటారియా కన్నుమూత

Telugu Lo Computer
0


కేంద్ర మాజీ మంత్రి, హర్యానా లోని అంబాలా బీజేపీ ఎంపీ రతన్‌లాల్ కటారియా గురువారం ఉదయం కన్నుమూశారు. 72 ఏళ్ల కటారియా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చండీగఢ్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బీజేపీ తరఫున మూడుసార్లు ఎంపీగా గెలిచిన కటారియా 2019 నుంచి 2021 వరకు కేంద్ర జలశక్తి, సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కటారియా మృతికి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ సంతాపం తెలియజేశారు. ఆయన నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)