జామ పండు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


జామ పండు లో యాంటీ ఆక్సిడెంట్‌లు, ఐరన్, క్యాల్షియం, విటమిన్ సి  పుష్కలంగా ఉంటాయి. ఆరెంజ్‌తో పోలిస్తే 5 రెట్లు ఎక్కువగా విటమిన్‌ సి ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా రోజువారీగా తీసుకోవాల్సిన కెలోరీలు, ఫైబర్ కంటెంట్‌ని ఈ జామ పండు బ్యాలెన్స్ చేస్తుంది. రోజువారీ డైట్‌లో ఒక జామపండులోని ఫైబర్ 12శాతం వరకు కవర్ చేస్తుంది. ప్రాసెస్ చేసిన స్నాక్స్‌కు బదులు జామపండును తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ మాదిరి రోజులో ఎప్పుడైనా దీనిని తీసుకోవచ్చు. ఇది బరువు తగ్గించడంలో సహాయ పడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగానూ ఉంచుతుంది. ఒక మీడియం సైజు జామ పండుతో దాదాపు 60 కెలోరీలు అందుతాయి. 24 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఫైబర్‌కి జామ పెట్టింది పేరు. కాబట్టి, 3-4 గ్రాముల ఫైబర్ అందుతుంది. 1 గ్రాము కన్నా తక్కువగానే కొవ్వు ఉంటుంది. 2.5 గ్రాముల ప్రొటీన్, A విటమిన్, B6 విటమిన్, K విటమిన్, C విటమిన్ ఉంటాయి. జామలో 400 మిల్లీ గ్రాముల మినరల్స్ లభ్యమవుతాయి. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. జామ పండుతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గడంలో ఇది సహాయ పడుతుంది. ఇందులోని ఎక్కువ ఫైబర్, తక్కువ క్యాలరీల కారణంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తీసుకోవాలని ఉండదు. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. మహిళలకు రుతు చక్రం సమయంలో నొప్పి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. పీరియడ్స్ సమయంలో రోజూ తీసుకోవడం మంచిది. ఫైబర్ పుష్కలంగా ఉండటంతో ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్‌లు గుండె పోటు నుంచి తప్పించే అవకాశం ఉంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. జామ సూపర్ ఫ్రూట్ అయినప్పటికీ మితిమీరి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో తింటే కొందరికి పడకపోవచ్చని చెబుతున్నారు. అలర్జీ, మొటిమలు రావడంతో పాపటు ఫైబర్ ఎక్కువగా ఉన్నందున డయేరియా వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందట. అలాగే ఈ ఫ్రూట్ పేరుతో చేసే పానీయాలను తీసుకోవడం సరైంది కాదని చెబుతున్నారు. అవి ప్రాసెస్ చేసి ఉంటాయని, వాటివల్ల నష్టమే ఎక్కువని నిపుణులు  హెచ్చరిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)