65 ఏళ్లు పైబడిన వారూ కూడా అవయవాలు స్వీకరించొచ్చు!

Telugu Lo Computer
0


మరణించిన దాతల నుంచి 65 ఏళ్లు పైబడిన రోగులు కూడా అవయవాలు స్వీకరించేందుకు తమ పేరును నమోదు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ''గతంలో గరిష్ఠ వయోపరిమితి 65 ఏళ్లు ఉండేది. ఇప్పుడు ఈ నిబంధన తొలగించడంతో ఏ వయసులో ఉన్నవారైనా మరణించిన వ్యక్తుల నుంచి అవయవాలు తీసుకోవచ్చు'' అని ఓ అధికారి పేర్కొన్నారు. అంతేకాదు.. అవయవాలు స్వీకరించే రోగుల నుంచి నివాస ధ్రువపత్రాలను అడగకూడదని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. రిజిస్ట్రేషన్‌ కోసం ఫీజులు కూడా వసూలు చేయకూడదని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)