అసోంలో 150 దుకాణాలు దగ్ధం

Telugu Lo Computer
0


అసోంలో జోర్ హాట్ లోని చౌక్ బజార్ లో ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో చుట్టుపక్కలా ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. భారీగా అగ్నికీలలు ఎగిసి పడ్డాయి. ఆ ప్రాంతమంతటా దట్టమైన పొగలు అలుముకున్నాయి. మొత్తం 150 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. అగ్నిప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నాయి. 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు గంటలపాటు కృషి చేశాయి. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిప్రమాద ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)