30న అఖిలపక్ష సమావేశం

Telugu Lo Computer
0


పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈనెల 30న అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో సార్వత్రిక బడ్జెట్-2023ను ప్రవేశపెట్ట నున్నారు. జనవరి 31వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీతో ముగుస్తాయి. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకూ స్వల్పకాలిక విరామం ఉంటుంది. 66 రోజులకు పైగా 27 సిట్టింగ్‌లు జరుగనున్నాయి. నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లోపు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుండటంతో ఈసారి బడ్జెట్‌పై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)