కొట్టాయంలో ఎండలు మండుతున్నాయి !

Telugu Lo Computer
0


కేరళలోని కొట్టాయంలో ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా చలితో గజగజ వణుకుతుంటే అక్కడ భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. కనీసం చల్లటి వాతావరణం కూడా లేదు. ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. నిన్న కొట్టాయంలో గరిష్టంగా 35 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న వారం రోజుల పాటు అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెంటిగ్రేడ్ చొప్పున నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వాతావరణం చల్లగా ఉండాల్సిన ఈ సమయంలో ఎండలు మండిపోతుండటం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇది చలి కాలమా? ఎండా కాలమా? అనే సందేహం కలుగుతోంది. ఎండ తీవ్రత తట్టుకోలేక జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. కొందరేమో గొడుగులతో రోడ్డెక్కుతున్నారు. మరోవైపు విపరీతమైన దాహం వేస్తోంది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని పానీయాలు సేవిస్తున్నారు. సీజన్ కు భిన్నంగా మండిపోతున్న ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)