ఆర్మీ జవాన్ పై మూక దాడి !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని నదియాడ్‌ పరిధిలోని చక్లాసి గ్రామంలో ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఇతని కూతురు స్థానికంగా ఓ ఉండే స్కూల్ లో చదువుకుంటుంది. అయితే ఇదే గ్రామానికి చెందిన ఓ 15 ఏళ్ల యువకుడు ఆ బాలికకు పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతోనే వాళ్లిద్దరూ తరుచు ఫోన్ లో మాట్లాడుకునేవారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆ యువకుడు ఆ బాలిక అసభ్యకరమైన వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తండ్రి ఆర్మీ జవాన్ కోపంతో ఊగిపోయాడు.  ఆ బాలుడు ఇంటికి వెళ్లిన ఎందుకు నా కూతురు అసభ్యకరమైన వీడియోను పోస్ట్ చేశావని ఆ బాలుడిని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఆర్మీ జవాన్ పై ఎదురు దాడికి దిగారు. మాటా మాటా పెరిగిపోవడంతో ఆ 15 ఏళ్ల బాలుడు ఆర్మీ జవాన్ పై దాడికి దిగాడు. ఆర్మీ జవాన్ పై విచక్షణారహితంగా దాడికి పాల్పడడంతో అతని కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. దాడికి పాల్పడిన కుటుంబ సభ్యులుపై ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)