మహారాష్ట్రలో భూప్రకంపనలు

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది.బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు పశ్చిమాన రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. 19.95 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 72.94 డిగ్రీల తూర్పు రేఖాంశంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చింది. తెల్లవారుజామున సంభవించిన భూప్రకంపనలతో ఇళ్లలో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)