ఐటీ సోదాల్లో రూ.100 కోట్లు స్వాధీనం !

Telugu Lo Computer
0


బంగారం, వజ్రాభరణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కొన్ని సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో దాదాపు రూ.100 కోట్లకు పైగా నల్లధనాన్ని సీజ్ చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ 17న నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో రూ. 5 కోట్లకు పైగా విలువైన లెక్కల్లో చూపని నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 14 బ్యాంకు లాకర్లను తనిఖీలు చేశారు. ఇప్పటివరకు, సెర్చ్ యాక్షన్ రూ. 100 కోట్లకు మించిన లెక్కల్లో చూపని లావాదేవీలను గుర్తించారు. పాట్నా, భాగల్‌పూర్, డెహ్రీ-ఆన్-సోన్, లక్నో, ఢిల్లీలోని 30కి పైగా ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి. సోదాల సమయంలో పలు కీలక పత్రాలు, ఆదాయ పన్ను ఎగవేతకు సంబంధించి కొన్ని ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. "బంగారం & వజ్రాల ఆభరణాల వ్యాపారం చేస్తున్న ఓ కంపెనీలో స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలను విశ్లేషించినప్పుడు, ఈ బృందం తన లెక్కలోకి రాని ఆదాయాన్ని ఆభరణాల నగదు కొనుగోలు, దుకాణాలు, స్థిరాస్తులలో పెట్టుబడి పెట్టినట్లు తేలిందని" అని పేర్కొంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కంపెనీలో భూమి కొనుగోలు, భవనాల నిర్మాణం, అపార్ట్‌మెంట్ల విక్రయాల్లో లెక్కలు చూపని నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలా లెక్కల్లో చూపని నగదు లావాదేవీల పరిమాణం రూ. 80 కోట్లకు పైగానే ఉందని పేర్కొంది. ఈ మధ్య దేశంలో చాలా చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి.తెలంగాణలోని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలు, యూనివర్సిటీలు, బంధువుల ఇళ్లలో రెండో రోజు కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంగళవారం సుదీర్ఘంగా సాగిన సోదాలు.. బుధవారం కూడా కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో దాదాపు రూ.4 కోట్లకుపైగా డబ్బును సీజ్ చేశారు. మల్లారెడ్డి లావాదేవీలు కొనసాగిస్తున్న క్రాంతి బ్యాంకు ఛైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)