ఎండుద్రాక్ష,.పెసర్లు,అవిసె గింజలు,మెంతులు - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


రక్తహీనత, అలసట, బలహీనత వంటి సమస్యలు ఉన్నవారు నానబెట్టిన ఆహారాలు తినడం వల్ల తక్షణ ప్రయోజనాలు లభిస్తాయి. బాదంపప్పు, మెంతులు, అవిసె గింజలు, ఎండుద్రాక్ష, మొదలైన వాటిని నానబెట్టి తినవచ్చు. ఎండుద్రాక్షలో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన ఎండుద్రాక్షను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గుతుంది. రక్తహీనత, కిడ్నీ స్టోన్ సమస్య తగ్గుతుంది. నానబెట్టిన ఎండు ద్రాక్ష తినడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఎండుద్రాక్షను రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకుంటే ఎసిడిటీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.పెసర్లలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్ధకం సమస్యని దూరం చేస్తాయి. అలాగే ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు ఉన్న రోగులకు మేలు చేస్తుంది. పెసర్లలో పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివల్ల  మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అవిసె గింజలని నానబెట్టి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో పెద్ద మొత్తంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మీకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంటే అవిసె గింజలని క్రమ తప్పకుండా తీసుకోవాలి. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అవిసె గింజలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. నానబెట్టిన అవిసెగింజలు పరగడుపున తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం చేకూరుతుంది. మెంతి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యను అధిగమించడానికి ఇది ఉత్తమమైన పరిష్కారం. ఒక చెంచా మెంతి గింజలను నీటిలో వేసి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. ఇది డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది. మహిళల్లో పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)